అదివాసి సంస్కృతి ఆనవాళ్లతో జరుగ నున్న “చిరుమళ్ళ సమ్మక్క కళ్యాణోత్సవం”
—అనాది ఆచారాలు అలుకు పూతలు,ముత్యాల ముగ్గులు, పసుపు కుంకుమలతో తల్లుల గద్దెల వద్ద ఆధ్యాత్మిక గుభాలింపు
— జాతర కోసం అత్యంత ఆసక్తిని చూపుతున్న ఆదివాసి కుటుంబాలు
నిత్యం సమ్మక్క ధ్యానంతో కఠోర వేదమంత్రోచ్చారణ నడుమ జాతరకు అదనపు శక్తిని ఇస్తున్న దీక్షాబాలలు
తొలి సమయం, ప్రత్యేక ప్రతినిధి మహబూబాబాద్ ఫిబ్రవరి11:
సమ్మక్క పుట్టుగద్దెల వద్ద చిరుమళ్ళ లో జాతర మొదలైంది, 13వ తారీకున జరుగనున్న సమ్మక్క కల్యాణోత్సవానికి ఆదివాసీ మహిళలు కుటుంబాలు దీక్షా బాలలు, జాతర కమిటీ అత్యంత సమన్వయంతో పనిచేస్తున్నారు.మహిళలు సమ్మక్క గద్దెలు, గుమ్మాలను అనాది ఆచార పద్దతితొ ఎర్ర మట్టి అలుకు పూతలు తీరొక్క ముత్యాల ముగ్గులు. పసుపు కుంకుమలతో గద్దెల ప్రాంగణం అధ్యంతం ఆదివాసి ఆధ్యాత్మిక సంస్కృతి మలాల వాసన కనపడుతోంది.దీక్ష బాలలు నిరంతరం సమ్మక్క ధ్యానంలో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. పాటలు భజనలతో గద్దెల వద్ద జాతరకు అదనపు శక్తితో పాటు ఆకర్షణ అవుతున్నారు. నిత్య దూపదీపారాధన, వేదమంత్రాలతో గద్దెల ప్రాంగణానికి దార్మికతను జోడిస్తున్నారు..సమ్మక్క తల్లి కళ్యాణోత్సవానికి కావాల్సిన పూల దండలను అల్లుతున్నారు, నిత్యం శివమాల తులిసిమాల తామరమాల తో దీక్ష బాలలు సమ్మక్క ధ్యానంలో ఉంటున్నారు, కఠోర ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్దలతో పాటిస్తున్నారు. ఆదివాసీ భక్తులు అభయారణ్యాల నుండి ఒక్కరోక్కరు చేరుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి మూలాలకు సంబంధించిన పూజా విధానాలు , నియమాలు దిక్షితులకు ఉండవలిసిన సంప్రదాయాలను అనుసరించే విదంగా గైడ్ చేస్తున్నారు.. ఈ కార్యక్రమం లో దీక్ష బాలల తో పాటు చందా వంశీయుల ఆడబిడ్డలు. పాల్గొన్నారు