“సమ్మక్క తల్లి కళ్యాణానికి” పలు చారిత్రక పుణ్య క్షేత్రాలనుండి సామాగ్రి
-కుంభ మేళా నుండి రచ్చ కోట మహారాజ్ పంద్రం జాలిష్ రావు జంగు బాయ్ ఉపా సకుల ఆధ్వర్యంలో రవి ప్రసాద్ స్వామి, ప్రసాద్ స్వామి సులోచన మాతలు గంగాజలం మట్టి విభూతి
—కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో విభూతి గంధం కుంకుమలు తెచ్చారు.
-చిరుమళ్ల పరిసరాల గుళ్ళు వారసత్వ ఇలవేల్పుల నుండి కళ్యాణ సామాగ్రిని గద్దెల వద్దకు చేర్చడం లో ప్రత్యేక శ్రద్ధ చూపిన కోయ పుణ్యం ధర్మప్రచారక్ చుంచు రామకృష్ణ
తొలి సమయం, ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ ఫిబ్రవరి 10:
చిరుమల్ల పుట్టు గద్దెల వద్ద నిర్వహించే సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణానికి పలు చారిత్రిక పుణ్యక్షేత్రాల నుండి చిరుమల్ల చేరిన సామగ్రిని చందా వంశస్థులకు కోయ పున్నెం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ అందచేశారు.అదేవిధంగా చిరుమళ్ళ పరిసర ఆదివాసి వేల్పుల గుళ్ల నుండి కూడా సమ్మక్క కళ్యాణానికి కావలసిన సంప్రదాయ సామాగ్రిని దేవతల ఆశీస్సులను తీసుకున్నారు. చిరుమళ్ళ సమ్మక్క కళ్యాణానికి బుజ్జాయిగూడెం సమ్మక్క తల్లి నుండి చీరె, పాల్వంచ పెద్దమ్మ తల్లి నుండి పువ్వులు గాజులతో పాటు,శివాల య ధ్వజస్తంభం ప్రతిష్టాపన సందర్బంగా పరమ శివుడి ఆశీస్సులు తీసుకొని, శివ పార్వతుల కళ్యాణం అక్షింతలు , తోగూడెం సమ్మక్క తల్లి నుండి పసుపు కుంకుమలు, గాజులు, బంగారం తెచ్చారు. అదేవిధంగా గొట్టెల శివాలయం శ్రీ సోమలింగేశ్వర స్వామినుండి సమ్మక్క కళ్యాణానికి ఆహ్వానం తో పాటుగా గంగా జలం కోసం పూజారి పాయం సోమయ్య తో ప్రత్యేక పూజలు చేసి 12 వ తారీకున వేసే కొత్త బోరు నీటిని చిరుమల్ల తీసుకువస్తామని ఆదివాసీ పూజారి తెలిపారు .కుంభ మేళా నుండి రచ్చకోట మహారాజ్ పంద్రం జాలిష్ రావు జంగు బాయ్ ఉపాసకుల ఆధ్వర్యంలో,రవి ప్రసాద్ స్వామి ,ప్రసాద్ స్వామి,సులోచన మాతలు గంగాజలం, మట్టి, విభూతి, కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో విభూతి గంధం కుంకుమలు తీసుకువచ్చి చందా వంశస్థులకు అందచేశారు. సమ్మక్క తల్లి కళ్యాణం కోసం విద్యుత్ ఉద్యోగులు అందరికంటే ముందుగా తల్లి కళ్యాణం కోసం విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సమనవ్యకర్త తెలిపారు. మొత్తంగా చిరుమళ్ళ పరిసర ఆదివాసీ వారసత్వ ఇలవేల్పులు, పెద్దమ్మ తల్లి, సమ్మక్క గద్దెలు,శివాలయాల నుండి సమ్మక్క తల్లి కళ్యాణం కోసం కళ్యాణ సామాగ్రిని ప్రత్యక్షంగా వెళ్లి తేవడంలో కోయ పుణ్యం ధర్మ ప్రచారక్, ఆదివాసీ 9తెగల సమన్వయకర్త, బండాని గోత్రం , బాలకుమారస్వామి వంశస్తులు చుంచు రామకృష్ణ ప్రత్యేక చొరువను చూపడం ప్రత్యేకతను సంతరించుకున్నది.ఈ కార్యక్రమం లో సమ్మక్క వంశీయులు చంద వీరయ్య గారు, బిక్షపతి గారు, సోలం వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.