ప్రతినోటా చిరుమళ్ల జాతరే..

ప్రతినోటా చిరుమళ్ల జాతరే..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

-అంచనాలకు మించి జాతరకు హాజరు కానున్న భక్త జనం

— ఇంత వరకు ఆర్ధిక సహాయం పై ప్రకటన చేయని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,

— చరిత్ర కలిగిన చిరుమల్ల జాతరకు భాగస్వామ్యం కాకుండా శషబిషలు పడుతున్న ఆదివాసి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు .ఇంత వరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళని కోయ జాతి ప్రజాప్రతినిధులు.

ఓటు బ్యాంకుకు అతీతంగా జాతి పండుగను బలోపేతానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్న ఆధార్ సొసైటీ AEWCA ,ఆదివాసీ విద్యా ఉద్యోగ, మహిళా శక్తి, ఉన్నత విరామ ఉద్యోగులు, విద్యార్థులు

 

చిరుమళ్ల మతలబు సమస్త ఆదివాసి తెగలకే పరిమితం కాదు, అడవుల్లో ఆదివాసేతర సబ్బండ జాతులకు కనెక్ట్ అవుతోంది,అనోట ఈనోట ఏనోట విన్న చిరుమళ్ల జాతర సంబురాలు, సమ్మక్క పగిడిద్దరాజుల లగ్గం విషేశాలు సర్వత్రా వినపడుతున్నాయి. అంచనాలకు మించి జాతర జనసంద్రం అవుతుంది అనే అంచనాలతో జాతర నిర్వహణ కమిటీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.జాతరను విజయవంతం చెయ్యడం కోసం సర్వం సకలం తల్లుల కోసం పూర్తి సమయం జాతర కమిటీ తో పాటు ఆదార్ సొసైటీ అదివాసీ మహిళా శక్తి శ్రేణులు, ఆదివాసీ విద్యా ఉద్యోగ,విరామ ఉన్నత స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. క్షణక్షణం అనుక్షణం సమ్మక్క సారలమ్మ జాతర పనుల పర్యవేక్షణలో కోయ పుణ్యం ధర్మ ప్రచారక్, అదివాసీ 9 తెగల సమన్వయకర్త , ఆదివాసి ఆస్తిత్వ మనుగడ కోసం సంస్కృతి పునర్జీవనమే అనే లక్ష్యం తో పాటు,జాతి ఐక్యత కోసం ఆదివాసీ ధార్మిక ప్రచారాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు పోతున్న చుంచు రామకృష్ణ ఈ జాతరను ఏటి కేటా భలోపేతం చేయడంలో ప్రధాన రోల్ గా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *