సమ్మక్క తల్లికి జాతర ఆహ్వానం పలికిన చందావంశీయులు మరియు సమ్మక్క దీక్షా బాలలు.

సమ్మక్క తల్లికి జాతర ఆహ్వానం పలికిన చందావంశీయులు మరియు సమ్మక్క దీక్షా బాలలు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ 7:

ముసలమ్మ గుట్టనుండి 13వతారీకున పగిడిద్ద రాజుతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని సమ్మక్క తల్లికి చందా వంశీయుల తో పాటుగా దీక్షా బాలలు చిరుమళ్ళ సమ్మక్క పుట్టు గద్దెల నుండి ఆహ్వానం పలికారు. కోయత్తుర్ ఆదివాసీ సంప్రదాయలను అనుసరించి సమ్మక్క తల్లికి పూలు పండ్లు పసుపు కుంకుమ రవికె ,గాజులు సమర్పణ చేసారు. ఈ కళ్యాణంలో పాల్గొనే ఎదిర, చందా వంశీయుల పడగ గుడ్డలతో పాటుగా 5 రాష్ట్రాల నుండి తరలి వస్తున్న వేల్పులను, వారు వంశస్తులను చల్లగా కాపాడి జాతరను విజయవంతం చెయ్యాలని కోరారు. తదనంతరం తిరిగి మళ్ళీ వస్తానని వీడ్కోలు పలికి ముసలమ్మ గుట్టకు బయలుదేరి సమ్మక్క క్షేమంగా చేరుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో చందా వంశీయులు చందా వీరయ్య , చందా భిక్షపతి, చందా గోవర్దన్ , చందా రామారావు, చందా భూపతయ్య, కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ చుంచు రామకృష్ణ మరియు దీక్షా బాలలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *