చిరుమళ్ల మహాజాతరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహాయం ప్రశ్నర్ధకమేనా!

చిరుమళ్ల మహాజాతరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహాయం ప్రశ్నర్ధకమేనా!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివాసి ఆ 4గురు ప్రజాప్రతినిధుల పై పెరుగుతున్న ఆదివాసీ శ్రేణుల వ్యతిరేకత

దాదాపు చిరుమళ్ల సమ్మక్క జాతర ఖర్చులు సుమారు 2కోట్లు

— ఈసారి ద్విగుణీకృతం చెందుతున్న జాతర, సుమారు 2లక్షల ఆదివాసీలు, 5రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు

— సీతక్క ఆదేశాను సారంగా మంచినీరు, కరెంట్, ప్రాంగణం సర్వ సౌకర్యాలు సంసిద్ధం చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం పి ఓ ఐటిడిఏ
తొలి సమయం ప్రధాన ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 5:

మంత్రి సీతక్క ఆదేశానుసారంగా చిరుమళ్ళ సమ్మక్క జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఐదు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ మహారాష్ట్ర ల నుండి ఆదివాసీ 9 తెగలు రానున్నారని జాతర కమిటీ తెలియజేస్తోంది. గత 2003 లో నిర్వహించిన ఈ జాతరకు 50వేల భిన్న ఆదివాసి జనం జాతరకు వచ్చారు, 124 ఆదివాసీ ఇలవేల్పులు తో ఆదివాసీ భక్తులు వచ్చారని కమిటీ తెలియజేస్తోంది.కోయ పుణ్యం ధర్మ ప్రచారక్ ఆదివాసి9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ దశదిశ నిర్దేశకత్వంలో జాతర ఆర్థిక స్థితిగతులు, గతం వర్తమానం భవిష్యత్తు జాతర విస్తృతిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, మంత్రులకు, రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి గత జాతర విశేషాల నివేదికలు ఇచ్చారు, ఆదివాసీ పిడికెడు కుటుంబాల సహాయంతో నడుస్తున్న చరిత్ర కలిగిన చిరుమల్ల సమ్మక్క జాతరకు ప్రభుత్వాలు బాధ్యతగా ఆర్ధిక సహాయం చెయ్యాలని చందా వంశస్థులతో పాటు, భక్తులు, ఆధార్ సొసైటీ బుద్దిజీవులు కోరుకుంటున్నారు. జాతర సమయం దగ్గర పడుతున్న కొద్ది, ఆదివాసీ రాజకీయ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యధోరణి పై సమస్త ఆదివాసీ తెగల్లో నైరాష్యం తో పాటు బలమైన వ్యతిరేకత కూడ వ్యక్తం అవుతోంది. మంత్రి సీతక్క, స్పందిస్తున్నప్పటికీ , ఆ నలుగురిలో కనీసం ప్రాధమిక స్పందన లేకపోవడంపై వారు ఆసక్తి కరమైన ఆరోపణల మూట గట్టుకుంటున్నారు. సీతక్క తో పాటు ఆ నలుగురు చారిత్రక మూలాలు కలిగిన కోయతురు వేల్పుల జాతర గురించి ముఖ్యమంత్రికి చెప్పకపోవడం వల్లనే చరిత్ర కలిగిన జాతరకు ఈ దుస్థితి వచ్చిందని, ఆదివాసీల పై జరుగుతున్న వివక్ష, అన్యాయాన్ని జాతి లో పుట్టిన ప్రతి ఒక్కరు బాధ్యతగా గమనించాలని జాతర కమిటీ పిలుపు నిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *