రాష్ట్ర గవర్నర్ ను కలిసిన చిరుమళ్ల సమ్మక్క సారక్క పుట్టు గద్దె జాతర కమిటీ

రాష్ట్ర గవర్నర్ ను కలిసిన చిరుమళ్ల సమ్మక్క సారక్క పుట్టు గద్దె జాతర కమిటీ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

–స్పందించిన గవర్నర్, జాతరకు వస్తాను అని హామీ

— ఆదివాసీ అధ్యాత్మిక క్రమశిక్షణ జాతర పునరుద్దరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిపారసు చేస్తానన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు

తొలి సమయం భద్రాద్రి కొత్తగూడెం ప్రత్యేక ప్రతినిధి 31:

రెండేళ్లకు ఒకసారి జరిగే (సిరిమల్లె) చిరుమళ్ళ లో జరిగే పుట్టు గద్దె జాతరకు చారిత్రక ఆధారాలు సజీవంగా ఉన్నాయి అని , ఈ జాతర ద్వారా చిరమల్ల గ్రామాన్ని ఆదివాసీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారం అందించాలని జాతర నిర్వహణ కమిటీ రాజ్ భవన్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన గవర్నర్ గారు చిరుమల్లలో జరిగే జాతర గురించి , కోయతూర్ వేల్పుల సంప్రదాయాలపై సమాలోచన చేశారు. ఆదివాసీల స్థితిగతులపై కూడా కమిటీతో మాట్లాడారు.. ఈ సందర్భంగా జాతర కమిటీ ఆర్థికపరమైన సమస్యల గురించి ఏకరవు పెట్టింది . సమ్మక్క తల్లి చిరుమళ్ల క్షేత్రంలో జరిగే సమ్మక్క పగడిద్దరాజుల కళ్యాణానికి ఐదు రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తజనం విడిది , భోజనాలు , వేల్పుల పూజా సామగ్రి కోసం, కోయతుర్ ఇలవేల్పుల సమ్మేళనాన్ని రెండేళ్ల కోమారు నిర్వహించుకోవడానికి ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. గతంలో 2023 లో మూడు రోజులపాటు జరిగిన జాతరకు సుమారు 50 వేల ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరు అయ్యారు అని , ఆ జాతరకు 125 ఇలావేల్పుల వచ్చాయి అని తెలియచేసారు. దీని ద్వారా తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ,ఒరిస్సా ఛత్తీస్ గడ్, మహారాష్ట్రాల లోని ఆదివాసీలకు సమ్మక్క సారక్క పుట్టు గద్దెల మహా జాతర విశేషాలు వ్యాప్తి చెందింది అన్నారు. ఆ విస్తృతితో కూడుకున్న ఈ జాతరను జరపడానికి ప్రభుత్వం బాధ్యతగా భావించి సహాయ సహకారాలు అందిస్తే మహా జాతరకు బలమైన పునాదులు పడతాయని జాతర కమిటీ గవర్నర్కు నివేదికలు అందించింది. ఆదివాసి ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడుకున్న ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని సిఫారసు చేస్తానని, అదేవిధంగా ఈ జాతరకు హాజరు అవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోయ పున్నెం ధర్మ ప్రచారక్, ఆదివాసీ 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ,ఆధార్ సొసైటీ నేషనల్ చైర్మన్ గొంది వెంకటరమణ. చిరుమళ్ళ క్షేత్రం ధర్మకర్త చందా బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *