వృద్ధులకు బాసట గా ఆర్.ఆర్. ఫౌండేషన్…
దాసరిపల్లి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన రూరల్ ఎస్సై అరుణ్..
తొలి సమయం నర్సంపేట జనవరి 9:
దాసరిపల్లి గ్రామంలోని చలితో వణుకుతున్నా వృద్ధుల కోసం గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై (NRI) దాసరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో డిఆర్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి గురువారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక రూరల్ ఎస్సై అరుణ్ పాల్గొని మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా రాబోయే కొత్త వైరస్ ను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఉద్దేశించి ప్రసంగించారు… గ్రామంలోని వృద్ధులకు సుమారు 350 దుప్పట్లను,
రూరల్ ఎస్సై అరుణ్ దుప్పట్లను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆర్గనైజర్ మేకల రాజేందర్, లెంక్కల మల్లేష్, మహేష్ ముద్దం రవి, కుక్కల మల్లేష్, బుదగొండ బిక్షపతి గ్రామస్తులు పాల్గొన్నారు….