బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర
—9మంది జవాన్లు మృతి
తొలిసమయం డెస్క్ హైదరాబాద్ జనవరి 05:
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి 9 మంది జవాన్లు మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. బీజాపూర్ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో ఈ మందుపాతర పేలింది.
జవాన్లు వెళ్తున్న వ్యానును మావోయిస్టులు పేల్చేశారు అని . దంతెవాడ, నారాయణ పూర్, బీజాపూర్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత జవాన్లు వెళ్తున్న సమ యంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారని బస్తర్ ఐజి మీడియాకు తెలిపారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే, మావోల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు.
అబూజ్మాడ్ లోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన మరవకముందే మావోయిస్టులు మందుపాతర పెట్టి తొమ్మిది మంది ప్రాణాలు తీశారనేది గమనార్హం