ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సొంత గ్రామం లోనే విలీనం లొల్లి

  1. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సొంత గ్రామంలో విలీనం లొల్లి…

మా తండాలో మారాజ్యం పోరాట పాలితమే పత్తి నాయక్ తండా..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—మళ్ళీ అమీనాబాద్ లో విలీనం అంటే లంబాడాల ఆత్మ గౌరవం ప్రశ్నార్ధకమేనా! అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, తిరుగబడిన పత్తి తండా వాసులు

తొలి సమయం నర్సంపేట డిసెంబర్ 31:
గతం లో మా తండాలో మారాజ్యం పోరాట ఫలితంగా పత్తి నాయక్ తండా గ్రామ పంచాయితీగా ఏర్పాటు అయ్యింది
కాని చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పత్తి నాయక్ తండా ను తిరిగి పూర్వ గ్రామ పంచాయితీ అమీనాబాద్ లోనే పత్తి నాయక్ తండాను విలీనం చేయాలనీ గ్రామ సభ పెట్టారు అని అభిప్రాయాల వ్యక్తం అవుతున్నాయి, అయితే పత్తి నాయక్ తండా వాసులు విలీనానికి శసేమిరా అంటూ నిప్పులు చేరుగారు, లంబాడాల ఆత్మ గౌరవపోరాట ఫలితంగా ఏర్పడిన పత్తి నాయక్ తండాను తిరిగి పూర్వ స్థితికి తీసుకరావడానికి జరిగే ప్రయత్నం లో భాగంగానే ఈ గ్రామం సభ పెట్టారని అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహణ కోసం వచ్చిన అధికారులను కాంగ్రెస్ నాయకులను నిల దీశారు.పత్తి తండా వాసులు గ్రామసభ ను నిరసిస్తూ.. ప్రభుత్వవ్యతిరేక నినాదాలు చేసారు. తండా వాసులు ఐక్యతను చాటుకున్నారు. పోరాడి తెచ్చుకున్న గ్రామ పంచాయితీని మళ్ళీ పాత గ్రామపంచాయితీ లో విలీనం చెయ్యడాన్ని ముక్తం కంఠం తో వ్యతిరేకించారు.మొత్తంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పై పత్తి నాయక్ తండా వాసులు నిరసన గళాలు ఎత్తారని తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *