బంగ్లాదేశ్ లో హిందువుల పై దారణ దాడులను ఖండించాలి..

బంగ్లాదేశ్ లో హిందువుల పై దారణ దాడులను ఖండించాలి..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— హిందూ చైతన్యమే భారత చైతన్యం,మరియు భారత సంక్షేమం

— బంగ్లాదేశ్ లో పాకిస్తాన్, చైనా, మరియు ఉగ్రవాద ముస్లిం ప్రేరేపిత దాడులే అనేది అని అర్ధం చేసుకోవాలి..

—- దేశంలోని దారుణాలు మారణహోమాలను నిరసిస్తూ చేసే క్రొవ్వొత్తుల ర్యాలీలు. హిందువులపై దాడులు చేస్తే ఏమయ్యాయి?

తొలి సమయం ప్రధాన ప్రతినిధి

మహబూబాబాద్ డిసెంబర్ 4:

మనదేశంలో మైనారిటీలుగా ఉన్న మతాలకు హక్కులు రిజర్వేషన్లు ఉంటాయి కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీ హిందువులకు మాత్రం హక్కులు ఉండవు పైగా పాకిస్తాన్ మరియు చైనా, ఉగ్రవాద ముస్లిం ప్రేరేపిత దాడులు జరగడం దారుణమని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ పింగిలి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు .. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లా దేశ్ లో హిందువుల పై జరిగే దాడులను కండిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీ ప్రధాన వీదుల్లో జరిగింది జిల్లా కోర్టు సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు.. సెంటర్ కోర్టు సెంటర్ అంబేద్కర్ విగ్రహం ముందు జిల్లా ఆర్ఎస్ఎస్ కార్య వాహ్ పింగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… భారతదేశంలో మహిళలపై, విద్యార్థినీలపై ఇంకా ఇతరేతర అమానవీయ దారుణాలు చోటు చేసుకున్నప్పుడు దేశం మొత్తంగా కొవ్వొత్తుల ర్యాలీ తీస్తూ నిరసనలు వ్యక్తం చేసే ఆచారం ఉంటుందని.. కానీ బంగ్లాదేశ్ లో హిందువులపై సుమారు 2000దాడులు జరిగాయని ఆ దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు ఎందుకు తీయడంలో ముందుకు రాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.. మనదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులకు హక్కులు ఉండవు, కానీ ఇక్కడ మైనారిటీ మతాలకు హక్కులు ఉంటాయి.. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులకు హక్కులు ఉండకపోయినా పర్వాలేదు కానీ రెండు వేల సార్లు దాడులు జరిగాయని, ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. ఇతర మతాలను హిందువులు గౌరవిస్తున్నప్పుడు తిరిగి వాళ్లు కూడా హిందువులకు అంతే స్థాయిలో గౌరవం ఇవ్వకుండా ద్వంద ప్రమాణాలతో వివక్షను చూపెట్టడం దారుణం అని అన్నారు.. సుమారు 2000 దాడులు బంగ్లాదేశ్ లో జరగడం యావత్ సమాజం గమనిస్తుందని అన్నారు.. ఈ దాడుల్ని భారత సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఒక్కతాటిపై నిలబడకుండా అర్థం కాని అంతర్గత కుట్రలను తెలుసుకోవాలని హితవు పలికారు.. హిందూ చైతన్యమే భారత చైతన్యమని అదే భారత సంక్షేమం అని అన్నారు.. ప్రక్క దేశమైన భారత బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను భారత దేశ హిందూ సమాజ హస్తిత్వంపై జరిగే దాడులుగా భావించాలని అన్నారు.. అనివార్యంగా హిందువులంతా ఒక్కటి కాకుంటే నష్టపోతామని అన్నారు రిజర్వేషన్ విద్యార్థి ఉద్యమాలు రూపాంతరం చెంది హిందువులపై దారుణంగా జరిగే దాడులుగా పరిణామం చెందడం అన్యాయం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో దార ఇందు భారతి. ఎలమంచిలి వెంకటేశ్వరరావు. మోసంగి మురళి. క్యాచ్ వల్ శ్యాంసుందర్ శర్మ, ఆకుల శ్రీనివాస్. పొన్నం మాల్ఫాని. ఓం నారాయణ లోయ. శ్రీరంగం మురళి భువనగిరి సుందర్ గుప్తా, సునీల్ పాట్ని గోపాల్ గిలాడా, జయప్రకాశ్ లోయ శర్వాన్ సూర్య ప్రకాష్ తదితరులు 100 మంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *