ఏసీబీ వలోలో చిక్కిన ల్యాండ్ అండ్ సర్వేయర్ శాఖ.. డ్రాప్ట్ మెన్ జ్యోతి శర్మ బాయ్…
తొలి సమయం మహబూబాబాద్ నవంబర్21:
మహబూబాబాద్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ల్యాండ్ అండ్ సర్వేయర్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇంచార్జ్ డ్రాప్ట్ మెన్ జ్యోతి శర్మ బాయ్ 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పన్నిన వలలో చిక్కింది..
ఏసీబీ అధికారుల వివరాలను అనుసరించి.. వరంగల్ కు చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబూబాబాద్ శివారు గుమ్ముడూరు ప్రాంతములో మూడు ఎకరాల ల్యాండ్ ను కొన్నారు. ఆ ల్యాండ్ పై ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా అనే కోణంలో T1 కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహబూబాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వేయర్ ల్యాండ్ ఆఫీసులో అప్లై చేశారు. డిపార్ట్మెంట్ లోని డ్రాప్ట్ మెన్ సీనియర్ ఇంచార్జ్ జ్యోతి శర్మ బాయ్ ఫిర్యాదు దారుడి వద్ద 20వేల రూపాయలను లంచంగా అడిగింది.. లంచం ఇచ్చి పని చేసుకోవడం ఇష్టంలేని ఫిర్యాదుదారుడు ఏసీబీ ని ఆశ్రయించారు. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో ఏసీబీ అధికారులు వలపన్నగా ఆమెను పట్టుబడింది అన్నారు
ఏసీబీ అధికారులు:- ఎవరైనా లంచం అడుగుతే టోల్ ఫ్రీ నెంబర్ 1064 నంబర్ కు ఫోన్ చేసి అవినీతికి ఆడ్డుకట్ట వేసి ఏసీబీ అధికారులకు సహకరించాలి అని కోరారు