మానుకోట వేదికగా బహురూప కొత్త జర్నలిస్ట్ సంఘాలు..
— ఒకే తానులోని ముక్కలే కొత్త సంఘాలు..
—-అవినీతి సంఘాల కొనసాగింపు, వాటి ఎత్తుకడలో భాగంగా ఏర్పడుతున్న కొత్త సంఘాలను నమ్మొద్దు..
డబ్ల్యూ జే ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాల కొండ అనిల్ దేశాయ్
తొలి సమయం మహబూబాబాద్ నవంబర్ 6: మానుకోట జిల్లా వేదికగా ఏర్పడుతున్న జర్నలిస్టు సంఘాలపై పలు అనుమానాలకు తావిస్తున్నట్లు డబ్ల్యూ జే ఐ ఉపాధ్యక్షులు న్యాలకొండ అనిల్ దేశాయ్ ఓ ప్రెస్ నోట్ ద్వారా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. మానుకోట కేంద్రంగా గత పదేళ్లలో జర్నలిస్టులపై అనేక దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులు. జరిగాయి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చారిత్రక నేపథ్యము కలిగిన మానుకోటలోనే విచిత్రంగా అత్యధికంగా ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరగడం ఆసక్తిని రేపుతోందని అన్నారు ఇక్కడ జర్నలిస్ట్ ల పై కనిపించని కుట్రలు జరిగినట్లు కూడా డబ్ల్యూ జే ఐ నిర్ధారణలో తేలింది అన్నారు..ఇన్వెస్టిగేషన్ కథనాలు, నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టుల గొంతులు నొక్కేసినప్పుడు జర్నలిస్టుల పక్షాన నిలబడని సంఘాలు గత రెండు మూడు నెలల నుండి మానుకోట జిల్లా కేంద్రంగా ఆయా సంఘాలు సభ్యత్వాల సంఖ్య పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఐరానా పడుతున్నాయని ఎద్దేవా చేశారు.. ఓ గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘం,కుల జర్నలిస్టు సంఘాల ఏర్పాటుకు సహకరించి ఆ సంఘాలను అనుబంధంగా బావిస్తూ బ్యాక్ బోన్ గా నిలిచింది అని ఆరోపించారు..ఇండ్ల స్థలాల పేరుతో గ్రామాలు మండలాల నుండి జనాన్ని జర్నలిస్టు పేరున కూడగట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు, డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా వస్తున్న జర్నలిస్టు సంఘాలు, ఆ నాయకుల ఆవిర్భావం ఎక్కడ నుండి వచ్చిందో, వాళ్ళు అంతా ఏ సంఘాలనుండి వచ్చారో గమనించాలని మనివి చేశారు, అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టులుగా పరిగణించే సంఘాలనుండే ఈ డిజిటల్ సంఘాలు ఏర్పడుతున్నాయని గమనించాలన్నారు.. అక్రిడేషన్ కార్డు లేకుండా అవినీతిపై కథనాలు రాసే ఇంటలెక్చువల్ జర్నలిస్టులపై రౌడీషీటర్లు దాడులు చేస్తున్నప్పుడు, అక్రమ కేసులతో నోళ్ళు నొక్కేస్తున్నప్పుడు నిద్ర నటించిన సంఘాలు బహురూపాలతో ముందుకు వస్తున్నాయని అన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనంతో బురిడీ హామీలతో వస్తున్న సంఘాలు, మిద్యా నాయకుల పట్ల జర్నలిస్టు మిత్రులు సంయమనం పాటిస్తూ.. డబ్ల్యూ జే ఐ ని స్వాగతించాలని పిలుపునిచ్చారు.. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నప్పుడు.. దాడికి గురైన వ్యక్తి జర్నలిస్ట్ అయితే చాలు, సంఘాలకుతీతంగా డబ్ల్యూ జే ఐ కాపాడుకుంటుందని శబదం చేశారు. ఇటీవల ఇల్లందులో జర్నలిస్టుపై రౌడీ షీటర్స్ దాడి జరిగినప్పుడు దుండగులపై కేసు నమోదు చేపించి,బాధిత జర్నలిస్ట్ పక్షాన నిలబడిన ఘనత డబ్ల్యూ జే ఐ కి దక్కిందని అన్నారు,వృత్తి ధర్మాన్ని పాటించే జర్నలిస్టులకు ట్రేడ్ యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధంగా ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జె ఐ)మాత్రమే నిలుస్తోంది అని అన్నారు.. త్వరలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఒక రక్షణ కవచంగా ఏర్పడబోతుందని సగర్వంగా చెబుతున్నాను అని అన్నారు..