ఏసీబీ వలలో విద్యుత్ లైన్ మెన్ చేప..
తొలి సమయం భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 24
విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డాడు.*ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఓ ఇంటి యజమాని విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సంప్రదించాడు. అందుకు రూ.26,000 లంచం ఇవ్వాలని లైన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు.* దీంతో చేసేదేమి లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నాగరాజుకు లంచం ఇస్తుండగా ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పాల్వంచ సబ్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు. *నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రమేష్ తెలిపారు.*