గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి
తొలి సమయం డెస్క్ హైదరాబాద్ :
ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించి ఆ తర్వాత దోశ తిన్నాడు. అయితే, దోశ గొంతులో ఇరుక్కుకపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని వెంటనే ఆసుప్రతికి తరలించగా..
అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. గతంలో కేరళలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నది. వలయార్‌లో ఇడ్లీలు తినే పోటీలు జరిగాయి. 50 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి పోటీలో పాల్గొన్నాడు. పోటీలో భాగంగా ఇడ్లీలు తింటున్న సమయంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతని ప్రాణాలు కాపాడేందుకు గొంతులో నుంచి ఇడ్లీలను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.