*రోడ్డెక్కిన పోలీస్ భార్యలు., కుటుంబసభ్యులు..*
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 23: శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసుల భార్యలు, కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. *వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేసారు.* కానిస్టేబుళ్లతో వెట్టిచాకిరి చేపిస్తూ,కనీసం సెలవులు కూడ ఇవ్వకుండా, కుటుంబానికి దూరం చేస్తున్నారని పోలీస్ ల భార్యలు ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని, కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేసారు. ఆర్టీఓ ఆఫీస్ నుండి మామునూరు బెటాలియన్ వరకు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈసందర్భంగా వారు కోరారు..