బీపీఎల్ సాకుతో జెర్నలిస్ట్ లకు ఇండ్ల ప్లాట్స్ దందా!

బీపీఎల్ సాకుతో జెర్నలిస్ట్ లకు ఇండ్ల ప్లాట్స్ దందా!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— బిలో పావర్టీ పేరున జెర్నలిస్టుల్లో పంచాయితీ పెట్టేది అధికారులా!జర్ణలిస్టు సంఘాలా!

— గతంలో పొందినవారికే మళ్ళీ ఇండ్ల స్థలాలు, ఇదెక్కడి న్యాయం..

–కోర్టు అంటే ఏమాత్రం గౌరవం లేని అధికారులు

*తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 24:గత 30 సంవత్సరాల నుండి కష్టపడి ఫీల్డ్ మీద పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి బిపిఆర్ఓ కనుసనల్లో అనేక దఫాలుగా బిపిఎల్ కింద ఏ వివాదం లేకుండా సాఫీగా.. పండుగ వాతావరణంలా ఇండ్ల ప్లాట్లు ఆత్మగౌరవంతో జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు.. బిపిఎల్ కింద అక్కడేషన్ కార్డు లేని వాళ్లకు. ఫీల్డ్ మీద పనిచేయకుండా దుర్మార్గంగా తీసుకునే అడ్డగోలు విధానం అసలే నడవలేదు.. కానీ గత సంవత్సరం నుండి మానుకోటలో బిపిఎల్ అనే అంశం కింద జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీలో అధికారులకు కాసుల పంట అయింది.. డబ్బులు ఇచ్చి ప్లాట్లు కొట్టేయడం వ్యవస్థీకృత నేరంగా మారింది*.*జర్నలిస్టుల్లోనే రెండు మూడు వర్గాలుగా విడగొట్టే దుర్మార్గులు ఈ వ్యవస్థలోనే ఉన్నారు*,*అధికారుల తలలో నాలుకలా ఉంటూ.. మొండిచేయి వాడికి నూకలు తిన నేర్పినట్లు బిపిఎల్ కింద అధికారులకు చేతివాటం నేర్పుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి..*

వివరాల్లోకి వెళితే… మాజీ ఎమ్మెల్యే జమానాలో.. మొత్తం 99 మంది బిపిఎల్ కింద ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పక్కా నిర్ణయం జరిగింది.. కానీ కోడెలు కోడెలు కొట్టుకుంటే లెగల కాళ్లు విరిగినట్లు విలువలతో కూడిన జర్నలిస్టులకు అన్యాయం జరిగింది*

*కురుచ బుద్ది జర్నలిస్టు సంఘ నాయకుడికి, గత లేకి డిపిఆర్ఓ తోడయ్యారు*

ఫలితంగా దారుణ చేతివాటం కు పాల్పడి మొత్తం 50 మంది ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇక్కడే మానుకోట జెర్నలిస్ట్ వ్యవస్థ కు గొడ్డలి పెట్టు అయ్యింది దీంట్లో గతంలో ఇండ్ల స్థలాలు తీసుకున్న జర్నలిస్టులు కూడా తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.. బిపిఎల్ పేరున అధికారులు లాలూచీకి తెర తీశారు.. అందువల్లనే ఫేక్ జర్నలిస్టులు ఇంటి స్థలాలు పొందారని అపవాదు మూట గట్టుకున్నారు. కొంతమంది వేరే జిల్లాల్లో ప్లాట్లు తీసుకుని స్థానికంగా ఉన్న జర్నలిస్టుల పొట్ట కొట్టారు, మళ్ళీ ఇక్కడ కూడా లొట్ట నింపుకున్నారు,ఎక్కడ పబ్లిక్ ప్లేస్ ఉంటే అక్కడ దస్తీ వేయడం మొదలెట్టారు.. (ఎపిసోడ్ తర్వాత ఉంటది)

*ఈ క్రమంలో జర్నస్ లిస్టు సంఘాలు ఏం చేయాలి*

ఈ సందర్భంలో సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టు, సంఘాలు సమన్వయంతో పనిచేసి.. అన్యాయం జరిగిన జర్నలిస్టుల లిస్టు తీసుకోవాలి, ఒకసారి ప్లాట్స్ పొందిన వాళ్లు మళ్లీ మళ్లీ ముందుకు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.. రెండవసారి ప్లాట్స్ తీసుకోవడం కోసం శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ తో లెటర్ రాపించారు,24మందితో కూడిన లిస్టు తయారు చేసారు.. అయితే ఇందులో ఇంతకుముందు తీసుకున్న వాళ్లు ఉన్నారు, అనే సమాచారాన్ని ఎమ్మెల్యేకు తెలువకపోవడం విచారం,రెండవసారి కూడా ఫ్లాట్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు అని తెలుస్తోంది. బిలో పవర్టీ కింద అక్రిడేషన్ కార్డు లేకున్న ఇయ్యడం నేరం అని తెలువని అధికారికి అక్రిడేషన్ కార్డు, అన్ని అర్హతలు ఉండి ఉండి కుటుంబంలో ఎంప్లాయ్మెంట్ ఉంటే యివ్వడం నేరం అనే కొత్త రూల్స్ మాత్రం తెలువడం షోచనీయం,,ఇది సంఘాలు ఖండించలేదు! అన్యాయం జరిగిన జర్నలిస్టులు కోర్టుకు వెళ్లారు.. కానీ కోర్టు ఇచ్చిన కాగితాలను లెక్కచేయకుండా అధికారులు దున్నపోతు మీద వర్షం పడ్డట్లు లెక్కచేయకుండా అదే తీరును అవలంబిస్తున్నారు… ఎలుకను చూసి ఇంటికి నిప్పు పెట్టినట్లు మానుకోట జర్నలిస్టుల్లో ఈ అగ్గి రాజేసిన నరాల మీద పుండు లాంటి నాయకుడు ఎవరు! వర్కింగ్ జర్నలిస్టులే ప్రమాణంగా ఇచ్చే ఇళ్ల స్థలాలు కేవలం బీపీఎల్ అనే సాకుతో ఇవ్వడం అనేది శాస్త్రియత అని అర్ధం! గతం లో ఇచ్చారు ఇప్పుడు ఎందుకు కోర్రీలు, ఎందుకు బిపిఎల్ కింద కొంతమందికి అన్యాయం చేయడం.. ఎవరో ద్వేషం తోనే ఇంప్లుఎన్సీ చేయడం వల్ల అధికారులు సంకుచితత్వ ధోరణికి గురి అవుతున్నారు అని అర్ధం అవుతోంది కనుక బిపిఎల్ కింద అందరిని సమానంగా చూసి ఇండ్ల ప్లాట్లు ఇస్తే ఇవ్వాలి.. లేకుంటే మానుకోటలో బిపిఎల్ కింద ఎవ్వరికీ ఇవ్వకుండా కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి జర్నలిస్టులు ఓ నూతన సంఘ వేదికగా రెడీ అవుతున్నారు…తస్మాత్ జాగ్రత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *