ఫారెస్ట్ భూముల్లో మట్టి దొంగలు.

ఫారెస్ట్ భూముల్లో మట్టి దొంగలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

–సమాచారం ఇవ్వడానికి అధికారుల శసబిషలు

— తాళ్ల పూసపెల్లి, అన్నారం శివారు ఫారెస్ట్ భూముల్లో ఆగని మట్టి దొంగలు

— ఫారెస్ట్ భూముపై అస్పష్టమైన వివరణతో అధికారుల పై పలు అనుమానాలు.

తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్20: తాళ్ల పూస పల్లి మరియు అన్నారం శివారు ఫారెస్ట్ భూముల్లో మట్టి దొంగలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారని,దిక్కు దివానా లేని జేసీబీ, ట్రాక్టర్లకు డ్రైవర్లుగా, ఓనర్లుగా ఓ సామాజిక వర్గానికి చెందిన పేదోళ్లను చూపెడుతున్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు మెండుగా ఉండడం వలన, ఈ దందా నడుస్తోంది అనే విమర్శలు ఉన్నాయి,ఫారెస్ట్ భూములపై కన్నేసిన రియల్ మాఫియా. మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా గత పదేళ్లలో ఫారెస్ట్ భూములను రైతుల పేరుట ఫేక్ రిజిస్ట్రేషన్ లను చేపించడం వెనుక ఉన్న మతులబే అక్రమ రియల్,మైనింగ్, మట్టి దొంగలు అనే టాక్ నడుస్తోంది. ఈ మూడు అక్రమ రంగాలు అధికారులను మానిఫ్లై చెయ్యడం వల్లనే.. ఫారెస్ట్ భూముల హననం యదేచ్చగా కొనసాగుతోందని విమర్శలు ఉన్నాయి.. తాళ్ల పూస పెళ్లి అన్నారం శివారు ఫారెస్ట్ భూముల్లో భారీగా అక్రమ తతంగం కొనసాగినట్లు పట్టణ ప్రజల్లో, పర్యావరణ ప్రేమికుల్లో, సామాజిక కర్తల్లో గుసగుసలు వినపడుతున్నాయి.. ఫారెస్ట్ మరియు రెవెన్యూ, అధికారుల అస్పష్టమైన వివరణలు ఇవ్వడంతో అధికారులపై పలు అనుమానాలకు తావిస్తోంది..

*ఎఫ్ఆర్ఓ జ్యోత్స్నా*
*మహబూబాబాద్*

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కడ ఏ సర్వే నంబర్ లో ఎంత భూమి ఉన్నది? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఇప్పటివరకు రెవెన్యూ కు ఆరుసార్లు దరఖాస్తు పెట్టుకున్నాము, సర్వే నెంబర్లు ఇవ్వలేదు, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెవెన్యూ మరియు ఫారెస్ట్ ఉమ్మడి భూమి లేదు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రిజర్వు అడవి జమాండ్ల పెళ్లి మరియు ఈదుల పూస పెళ్లి సెక్షన్స్ లో కంపార్ట్మెంట్స్ నెంబర్స్ తో కలిసి ఉన్నది. రెవెన్యూ సర్వే నెంబర్స్ తో కలపబడిన భూమి లేదు, ఒకవేళ ఉన్నా..భూమి ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్స్ తో కలిసి ఉన్నది. కనీసం హద్దులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా.. హద్దులు ఎవరో పీకేశారు.. పీకేసిన వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా!అనే ప్రశ్నకు సమాధానం కూడా లేక పోవచ్చును అనేది అడ్వాన్స్ గా తెలిసి పోతోంది.

*వోల్టా చట్టం మార్గదర్శకాలు*

గాలికి వదిలేయడం వల్లనే మట్టి దొంగలకు పట్టు పగ్గాలు లేకుండా పోయాయని పర్యావరణ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలు కొనసాగుతున్నాయి..

*కలెక్టర్ వెంటనే స్పందించాలి*
మహబూబాబాద్ రెవెన్యూ మరియు మున్సిపాలిటీ పరిధిలోని.. ఈదుల పూస పెళ్లి, మరియు అన్నారం శివారు ఫారెస్ట్ భూముల సర్వే నెంబర్లను. భూమి వివరాల స్పష్టమైన సమాచారము ఇచ్చే విధంగా.. రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖ కార్యాలయాల్లో పక్కా సమాచారము ఉండే విధంగా చొరవ తీసుకోవాలి, ఇప్పటివరకు ఫారెస్టు భూముల్లో ఫేక్ బావులు తవ్వి మట్టిని అమ్ముకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ఫారెస్ట్ భూములకు పక్కా హద్దులు ఏర్పాటుచేసి, మట్టి మైనింగ్ దందాకు చెక్కు పెట్టి ఫారెస్ట్ భూములను కాపాడాలని.. జిల్లా పర్యావరణ ప్రేమికులు సామాజిక కర్తలు, పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *