టిఆర్ఎస్ నుండి వొచ్చిన జంపింగ్ జపాంగే కాంగ్రెస్ లో చక్రం తిప్పడం!

టిఆర్ఎస్ నుండి వొచ్చిన జంపింగ్ జపాంగే కాంగ్రెస్ లో చక్రం తిప్పడం!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—- మమ్ములను దద్దమ్మలను చేస్తుండు, ఇదెక్కడి న్యాయం

—- జెండాలు మోసిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడాలి..

— బయ్యారం మండల టౌన్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి

తొలి సమయం, బయ్యారం అక్టోబర్ 16 : పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డం ది డ్డంగా సంపాదించుకొని, కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను. ముప్పు తిప్పలు పెట్టిన బి ఆర్ ఎస్ నాయకుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ లో లీడర్ అయ్యాడు.. పదేళ్ల కాలం నుండి ఆయన వెంట తిరిగినా టిఆర్ఎస్ శ్రేణులను అందరినీ కాంగ్రెస్ లో కలిపాడు.. పదేళ్ల నుండి ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని యుద్ధం చేసాము, ఆయన పెట్టే అనేక అవమానాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాం.. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఇప్పుడు మేము తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో ఉండడానికి బదులు.. ఆయన నేతృత్వంలో తలవంచుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఆసన్నమైందని ఆ వేదనపడ్డారు, పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండాలు మోసిన కార్యకర్తలుగా మా బ్రతుకులు ప్రశ్నార్ధకమయ్యాయి,అని బయ్యారం మండల కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాయిని శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తన ఆవేదనను తెలియజేశారు ఈ సందర్భంగా అనేక విషయాలు చెప్పారు.. కాంగ్రెస్ పార్టీలోకి ఆ జంపింగ్ జపాంగ్ వచ్చాక టిఆర్ఎస్ లో ఉన్న ఆయన క్యాడర్ అంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. కనుక ఇప్పుడు ఆయన తన వ్యక్తిగత క్యాడర్ ను కాపాడుకుంటున్నారు అని ఆరోపించారు. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మమ్ములను అవహేళన చేసినా,ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము డోంట్ కేర్ అని కాంగ్రెస్ జెండాను భుజాలపై వేసుకొని అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపుకు రోడ్లెక్కాము, ధర్నాలు పికటింగుల్లో పాల్గొన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వచ్చిన సంతోషము మాకు మిగలకుండానే.. బిఆర్ఎస్ లో డబ్బులు కూడేసుకున్న ఆ నాయకుడే మళ్లీ కాంగ్రెస్ లీడర్ కావడం వలన మేము మనస్థాపానికి గురైతున్నామని అన్నారు.. మమ్ములను ఉట్టి దద్దమ్మలను చేసి పడేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించాలని వేడుకున్నారు.. ఇన్నేళ్లుగా కష్టపడ్డమాకు కాంగ్రెస్ మిగిల్చింది కన్నీళ్లేనా? అన్నారు.. వాళ్లను ఆహ్వానించాం, ఎవరి పని వాళ్లు చేసుకుంటూ కాంగ్రెస్ కోసం పాటుపడుదాం అన్నారు . కానీ బయ్యారం మండలం మొత్తం అధికారం చలాయిస్తూ బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా తానై నడపాలని వ్యూహ రచన చేస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గత పది సంవత్సరాలు అతనికి ఎదురు తిరిగి పనిచేసినోళ్లపై దౌర్జన్యాలకు భౌతిక దాడులకు దిగుతామంటే… జరగబోయే పరిణామాలకు ఆ అవకాశవాద నాయకుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని నిప్పులు చెరిగారు, బయ్యారం మండల కాంగ్రెస్ జరిగే గజిబిజి గందరగోళాన్ని అధిష్టానం గమనించి నికార్సైన కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పజెప్పాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *