దివంగత నేత నూకల నరేష్ రెడ్డిది అరుదైన రాజకీయ వ్యక్తిత్వం..
రాజకీయాల్లో తన ఆస్తులను తృణప్రాయంగా కరిగించుకున్నారు,
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్15:
సీనియర్ రాజకీయ నాయకులు దివంగత నూకల నరేష్ రెడ్డిది, అరుదైన రాజకీయ వ్యక్తుత్వమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకుల ఏకాభిప్రాయంగా అన్నారు, మాట్లాడారు..ఇటీవల మరణించిన. సీనియర్ రాజకీయ నాయకులు నూకల నరేష్ రెడ్డి సంతాప సభ మరియు దశదినకర్మ, పురుషోత్తమాయగూడెంలోని ఆయన మామిడి తోటలో జరిగింది.. ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత బాధ్యతతో నిర్వహించారు కార్యక్రమంలో నరేష్ రెడ్డి కుమారులు, అభినవ్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. డోర్నకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు యువజన సంఘాలు కార్యకర్తలు తదితర ప్రజలు అశేషంగా కదిలి వచ్చారు