ఎస్సై (గంజాయి )కారణంగా కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్య,
తొలి భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 14:
పినపాక నియోజకవర్గం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సాగర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సాగర్ చికిత్స పొందుతూ ఐసియు బెడ్ పై తెలిపిన వివరాల ప్రకారం… పినపాక నియోజకవర్గం బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న, ఎస్సైలు రాజ్ కుమార్ సంతోష్ గంజాయి మాఫియా గోనె నానితోకలిసి గంజాయి వ్యాపారం చేశారు.. పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీగా ఉన్న గంజాయిని అమ్మేశారు సంతోష్ ఎస్సై బదిలీ అయిపోగా తాతంగాన్ని మొత్తం రాజ్ కుమార్ ఎస్సై కి వప్ప జెప్పారు,. అక్రమంగా అమ్ముకున్న గంజాయిని భర్తీ చేయడం కోసం నా ఫోను ద్వారా గంజాయి వ్యాపారులకు ఫోన్ చేపించి పోలీస్ స్టేషన్ నుండి పోయిన ప్రాపర్టీని రికవరీ చేసే ప్రయత్నంలో నన్నే బాద్యుడిగా చేసారు,నాకు చావు తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డానని అన్నారు.. సీఎం రేవంత్ అన్నా నీకు దండం పెడతాను, నా కుటుంబానికి న్యాయం చెయ్యాలి, అంటూ వేడుకున్నాడు,