.కంబాలపల్లి ముద్దు బిడ్డ మాతంగి వీరస్వామికి డాక్టరేట్ ప్రధానం…

కంబాలపల్లి ముద్దు బిడ్డ మాతంగి వీరస్వామికి డాక్టరేట్ ప్రధానం…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 4: కంబాల పల్లి ముద్దుబిడ్డ మాతంగి వీరస్వామి కి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.. అభ్యుదయ కవి,విమర్శకుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ రచనలు- పరిశీలన అనే అంశం పై ప్రొఫెసర్ బన్న అయిలయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసిన మాతంగి వీరస్వామి కి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ప్రధానం చేసినట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. మాతంగి వీరస్వామి 1987వ సంవత్సరంలో జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చేరి అంచెలంచలుగా ఎదిగారు. ప్రస్తుతం అదే శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా హైదరాబాద్ రేంజ్ డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్నారు, వీరస్వామి ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందినవారు. ఉద్యోగములో చేరిన తర్వాతనే డిగ్రీ, పీజీ ఎక్స్టర్నల్ గా కాకతీయ విశ్వవిద్యాలయంలోనే పూర్తి చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *