మోటారు సైకిళ్ల దొంగను పట్టుకున్న టౌన్ పోలీసులు— డి.ఎస్.పి తిరుమలరావు

మోటారు సైకిళ్ల దొంగను పట్టుకున్న టౌన్ పోలీసులు— డి.ఎస్.పి తిరుమలరావు“

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— అపరిచితుల నుండి అపరిచితుల నుండి తక్కువ ధరకు మోటార్ సైకిల్ కొనుగోలు చట్ట పరమైన చర్యలు…

తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 03: మోటారు సైకిళ్ళ దొంగను అరెస్టు చేసినట్లు డిఎస్పి తిరుమలరావు తెలిపారు.. టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ ఆదేశాల మేరకు ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందితో మహబూబాబాద్ సలార్ తండా శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ను పక్కకు పడేసి పారిపోతుండగా, పోలీసులు వెంటపడి పట్టుకున్నారు, అతని విచారించగా.. తన పేరు ధారావత్ బావ్ సింగ్27 తండ్రి భద్రు కులం లంబాడా వృత్తి వృత్తి కూలి…. గత కొద్ది కాలంగా మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ నెహ్రూ సెంటర్ కురవి వీరభద్ర స్వామి గుడి చుట్టుపక్కల తాళం వేసిన 10 మోటార్ సైకిళ్లను దొంగిలించాడని అన్నారు వాటిలో ఆరు మోటారు సైకిళ్లను తక్కువ ధరకు అమ్మేశాడని అన్నారు ఇంకా తన దగ్గర నాలుగు మోటార్ సైకిల్ ఉన్నట్లుగా తెలియజేశారు ఇతని దగ్గర సైకిల్ మోటార్లు కొన్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది అన్నారు పనీ పాటు లేకుండా తిరుగుతూ జల్సాలకు మరిగి దొంగతనాలను అలవాటు చేసుకున్నాడని అన్నారు.. కనుక తక్కువ ధరకు వస్తున్నాయి అనే దురాశతో అపరిచితుల వద్ద మోటారు సైకిళ్లను కొనడం చట్టపరమైన నేరంగా పరిగణించబడుతుంది. అట్టి వారిపై కేసు నమోదు చేయడం అవుతుందని డిఎస్పి హెచ్చరిక చేశారు.. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టౌన్ సిఐ, ఎస్సై మరియు సిబ్బందిని అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *