సబ్బండ జన నివాళ్ల నడుమ సాగిన చుక్కల చందర్ అంతిమ యాత్ర…
—- చితి వరకుపాడె మోసిన, టీ పీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి,శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్
— పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన ఉభయ కమ్యూనిస్టులు,
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 1: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ సోమవారం గుండెపోటుతో హఠాత్ మరణం చెందగా.. ఆయన పార్థివదేహాన్ని జనం సందర్శనార్థం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉంచారు.. ఆయన పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మరియు టిపిసిసి ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి.అంతిమ యాత్ర చివరి వరకు పాడె మోసారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంకా నివాళులర్పించిన వారిలో. ఉభయ కమ్యూనిస్టులు.. సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సూర్య, సిపిఐ పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శి విజయ్ సారధి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి ఉన్నారు.. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కీసర పద్మాకర్ రెడ్డి. సీనియర్ అడ్వాకేట్ వంగ నాగేశ్వర్ రావు,దాసరి నాగేశ్వరరావు, డేగల సత్యనారాయణ, మున్నా,కొండ బత్తుల యాదగిరి, ప్రొద్దుటూరు రవికుమార్ ప్రొద్దుటూరు రవికుమార్, మామిడాల, పుల్లూరి కృష్ణ,చక్రవర్తి,శ్రీనాథ్ ఉప్పలయ్య, శృతి, రాజ్యశ్రీ రామ్ రెడ్డి హరికృష్ణ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుకొండపల్లి రామచంద్రరావు.బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య, సిరికొండ సంపత్ భద్రయ్య చుక్కల నరేష్, యశ్వంత్, బోయినపల్లి లక్ష్మణరావు, డాక్టర్ వెంకట్రామ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు పారింది రామయ్య, జన సమితి జిల్లా అధ్యక్షులు డోలు డాక్టర్ డోలి సత్యనారాయణ, టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ మైసా శ్రీనివాస్, మైస నాగయ్య,ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ శ్రేణులు నివాళులర్పించారు… నాలుగు గంటలకు తన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. ఆరున్నర వరకు స్మశాన వాటికకు చేరే వరకు డప్పు సప్పుళ్లు కళాబృందాలతో కన్నీటి వీడ్కోలు పలికారు..