నిలకడలో నూకల నరేష్ రెడ్డి ఆరోగ్యం.
..తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 30:
సీనియర్ రాజకీయ నాయకులు, స్నేహ యువ కేంద్ర వ్యవస్థాపకులు నూకల నరేష్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు అనే వార్త మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లోని ప్రజల్లో విషాదంతో కూడిన ఉత్కంఠ చోటు చేసుకున్నది. వెంటనే హైదరాబాద్ నానక్ రామగూడ లోని స్టార్ హాస్పిటల్ లో అత్యవసర విభాగంలో వెంటనే చికిత్స అందడం మూలంగా.. నరేష్ రెడ్డి ఆరోగ్యం సేవ్ జోన్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.. రెండు నియోజకవర్గాల్లోని యూత్,ప్రజలు నరేష్ రెడ్డి తిరిగి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు.