మానుకోట లో మాడ్రా యాక్షన్ ప్లాన్ కు లైన్ క్లియర్

మానుకోట మాడ్రా యాక్షన్ ప్లాన్ కు లైన్ క్లియర్…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ బంధం చెరువు నిజాం చెరువుల తో షురూ..

తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 28:

మానుకోట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మాడ్రా యాక్షన్ ప్లాన్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏ సమయంలో కూల్చివేతలకు రంగ ప్రవేశం చేసేందుకు అధికారులు అన్ని రకాల క్లీన్ చిట్స్ పొంది ఉన్నారనే సమాచారం హడావుడి చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం మానుకోట లోని చెరువుల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగాలతో సమాచారం సేకరిస్తున్నట్లు బలమైన చర్చలు కొనసాగుతున్నాయి 76 మందికి ముందస్తు నోటీసులు ఇచ్చినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కలెక్టర్ కు సమాచారం తెలియజేస్తున్నట్లు టాక్ నడుస్తోంది మహబూబాబాద్ పట్టణ నడిబొడ్డులో అందమైన ప్రకృతి అందాలకు పెట్టిన పేరుగా ఉన్న నిజాం చెరువు చుట్టుపక్కల ఉన్న అక్రమార్కుల అక్రమ నిర్మాణాలపైన్నే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇరిగేషన్ శాఖ ఇచ్చిన తప్పుడు ఎన్ఓసీలు, ఇచ్చిన అధికారులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది శాంత కుమారి, గునుగంటి పద్మ,గురజాల అలేఖ్య, కందిరాజు భవాని,గునిగంటి కమలాకర్,నాయిని రంజిత్, పల్లా రామచంద్రారెడ్డి ముత్యం వెంకన్న ఆవుల వెంకన్న గడ్డం విజయ్ కుమార్ శ్రీ రామోజీ రమేష్, శాంత్విక్ రెడ్డి, లు బంధం చెరువు నుండి ఎన్ఓసీలు పొంది ఉన్నారు అలాగే శ్రీమతి సత్య మనోరమ ( జమాండ్ల పెళ్లి) పెట్రోల్ డీజిల్ అవుట్ లెట్ బంకు ఈదుల పూస పల్లి లకు ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఎన్ఓసీలలో హేతుబద్ధత ఉన్నదా లేదా అనే కోణంలో మాడ్రా నిషిత పరిశీలన చేస్తున్నారని సమాచారం,ఒకవేళ అక్రమంగా ఇరిగేషన్ అధికారులు ఇచ్చినట్లు అయితే వాళ్లపై కూడా నిర్దాక్షిణ్యంగా యాక్షన్ ప్లాన్ చేయడానికి మాడ్ర సంసిద్ధమైనట్లు సమాచారం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *