భూపోరాటల్లో మానుకోట అరుదైన స్టైల్ మార్క..
అరుదైన భూపోరాటం పేరున ప్రభుత్వ భూములను పప్పు బెల్లం లా అమ్ముకున్న పలక పార్టీలు
—.ఇక్కడ మొదట కమ్యూనిస్ట్ లు పిదప అన్ని పార్టీలు భూపోరాటం పేరున ప్రభుత్వభూముల్లో కాలనీలు ఏర్పాటు చేసుకొన్నారు
—- చెరువు షికాలనుండి గుడిసెలు తొలగించే ముందు.. ఇల్లు కోల్పోయిన వారికి 70 గజాల జాగతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలి
తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 28: ఒకప్పుడు భూ పోరాటాలు కేవలం ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలకే సొంతం అన్నట్లుగా ఉండేది. మానుకోటలోఉభయ కమ్యూనిస్టులతో పాటు.. అన్ని ఎర్రజెండా పార్టీలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర కలిగి ఉన్నాయి.. కాలం తెచ్చిన మార్పులతో భూ పోరాటాల అర్థం మారిపోయింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలుగుదేశానికి మద్దతుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో ఎన్నికల్లో తలబడేది.జనాన్ని జనం పాటలతో ఊర్రూత లూగించి ఓ వెలుగు వెలిగారు. ఎత్తులు వ్యూహాల్లో భాగంగా ఆపార్టీ తనదైన ఓ ప్రత్యేకతను సంతరించుకొని. బలమైన చర్చనీయాంశంగా మారింది, కాలక్రమమైన రాజకీయ సమీకరణాల్లో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా ఉభయ కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నార్ధకమయ్యింది…. అన్ని పార్టీలు కూడ కాలనీల ఏర్పాటుకు స్వీకారం చుట్టాయి..
*పాలక పార్టీలు*
తెలుగుదేశంహయాంలో లో శ్రీరామ్ భద్రయ్య కాలనీ, ఎన్టీఆర్ కాలనీలు ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ కాలనీలు.. రామన్న పేట కాలనీ, రాజీవ్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ, రెడ్యానాయక్ కాలనీ, కవితకాలనీలతో పాటు -కెటీఆర్ కాలనీ,లు ఏర్పడ్డాయి
*సిపిఐ కి సంబంధించిన కాలనీలు*
. వేల్పుల సత్యంకాలనీ, గిరి ప్రసాద్ నగర్ కాలనీ, ధర్మన్న కాలనీ, పార్థసారథి కన్న కాలనీ, తలారి వెంకటేశ్వర్లు కాలనీ,మాస బత్తిని వెంకటమల్లు కాలనీ, కొండపల్లి గోపాల్ రావు కాలనీ, మిలిటరీ కాలనీలు, భగత్ సింగ్ కాలనీ, ఏర్పడ్డాయి,
*సిపిఏం కాలనీలు…*
సుందరయ్య నగర్, జ్యోతి బస్ నగర్, కుండ్లకుంట, ఆకుల లక్ష్మయ్య నగర్, ఎన్ ఎం నగర్, సిహెచ్ నగర్, టీ బీనగర్, కొత్త కలెక్టర్ పాత కలెక్టర్ ఆఫిస్ కాలనీలు మల్లు స్వరాజ్యం నగర్ ఎల్బీజీ నగర్..
*సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కాలనీలు*
భగత్ సింగ్ కాలనీ, మాధవ్ అన్న కాలనీ, విక్రమ్ నగర్ కాలనీ, దొరన్న నగర్, అంజన్న నగర్ ప్రగతి నగర్,
ఎమ్మార్పిఎస్ కాలని, మందకొమురమ్మ కాలనీ. వికలాలాంగుల కాలనీలు ఏర్పడ్డాయి.. ఇతరత్రా పేర్లపై కాలనీలులు కూడా ఉన్నాయి అని తెలుస్తోంది..
*మరీవిచిత్రం ఏమిటీ అంటే కాంగ్రెస్ తెలుగుదేశం కాలనీలు బ్రతికి ఉన్నోళ్ల పేరున కాలనీలు ఏర్పడడం మితిమీరిన చైతన్యనానికి నిదర్శనంగా మానుకోట నిలిచింది అనడానికి*
భూ పోరాటాల పేరుతో.. కాంగ్రెస్ తెలుగుదేశం కాలనీల్లోని జనం ఆ ఇంటి జాగాలను కొనుక్కున్నారని.. పోరాటం అసలే కాదు అనే ప్రచారం కూడా నడుస్తోంది.మాడ్రా పేరున చెరువుల రక్షణకోసం వస్తున్న సంస్థ.. చెరువు శికాల్లో ఉన్న బడా బాబుల ఇండ్లు అటు ఉంచితే పేదోళ్ల ఇండ్లు కూల్చే ముందు వాళ్లకు 70 గజాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్ రూమ్ సౌకర్యం కల్పించాలి.. అనే డిమాండ్ తో చెరువు శికాల్లోని పేదోళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు