’
చెరువు ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు
–ఎఫ్టీఎల్ బుఫర్ జోన్స్ షికాలు కొని మోస పోవొద్దంటూ మున్సిపాలిటీ కేంద్రం కొనసాగుతున్న చర్చలు
— మున్సిపాలిటీ లో డోర్ రిజిస్ట్రేషన్ ఇప్పిస్తామని పేదోళ్లను బురిడీ కొట్టించిన వాళ్ళు కూడ అదే కాలనీల్లో ఉండడంవలన.. ఎంకి సావుముత్తి పెళ్లికి వచ్చినట్లు అవుతోంది కాలనీ పేదోళ్ల పరిస్థితి
తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 25,: హైడ్రా లాంటి మాడ్రా వస్తుందా! అన్ని జిల్లాల లాగ మన జిల్లాలో కూడా ఆక్రమిత భూములను ప్రభుత్వం రికవరీ చేస్తుందా! ఇది జరిగే పని కాదు అంటూ అతిశయోక్తిగా మాట్లాడుకుంటున్నారు, ఇలా మానుకోటకు రానున్న మాడ్రా పై పలు అనుమానాలకు కారణాలు లేకపోలేదు. భూకబ్జాదారుల్లో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ, గత బిఆర్ఎస్, మున్సిపాలిటీలోని వార్డ్ కౌన్సిలర్లు కూడా ముందు వరుసలో కబ్జాసార్ల లిస్టులో ఉన్నారనే ప్రచారం బలంగా కొనసాగుతోంది..
అయితే.. చెరువు శిఖాలు ఏఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న రామన్నపేట కాలనీ కేటీఆర్ కాలనీ. వై ఎస్ యార్ కాలనీవాసుల్లో గుబులు మొదలు అయ్యింది.. అయితే చెరువు శిఖాల్లో ఇండ్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని చాలా ఏళ్లయింది.. కుటుంబాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూలగొడితే మా బ్రతుకులు ఏం కావాలి అనే బడుగు జీవులు ఒకపక్కన ఉండగా!
—-రాజకీయ అండతో కాలనీలను అడ్డాగా, దాందాలు చేస్తూ.. చెరువులను అమ్ముకొని డబ్బులు కూడేసుకొని, ప్రశ్నించే వారిపై గోబెల్ ప్రచారం చేస్తూనే.. చంపేస్తాం, తలలు తీసేస్తాం అంటూ.. జర్నలిస్ట్ లను బెదిరించే వారు కూడ ఇదే కాలనీలో తిష్ట వేయడం వలన ఎంకి పెళ్లి ముత్తి సావు కొచ్చినట్లుగా ఉన్నది కాలనీ వాసుల పరిస్థితి. చెరువు సికాల భూములను ప్రభుత్వం కాపాడే పనిలో పడ్డది.. ఇటీవల రామన్నపేట కాలనీలో నోటీసులు ఇవ్వడంతో కాలనీవాసులు భయంతో వణికి పోతున్నారు.. చెరువు శికాల ఆక్రమణ దగ్గర గ్రామాల నుండి వచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాలు గుంట రెండు నుంచి మూడు లక్షలు చొప్పున విక్రయించారు అని, ఇప్పుడు వాళ్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది కనుక. చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్స్ షికాలు కొని మోసపోకుండా ప్రజలు జాగ్రత్త పడాలి అనే ప్రచారం మున్సిపాలిటీ కేంద్రంలో బలంగా జరుగుతుంది