అంబటి వీరభద్రం శ్వాసా ద్యాసా అంతా కాంగ్రెస్ పైన్నే..
*—కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వరుస విజయాల్లోఅంబటి పాత్ర కీలకం, రెడ్యా కాంగ్రెస్ వీడి గులాబీ కండువా కప్పుకున్నా.. కాంగ్రెస్ ను వీడని స్థిరచిత్తానికి చిరునామగా నిలిచిన అంబటి*
*– తెలుగుదేశం, తెలంగాణా ఉద్యమ సునామీల్లో కాంగ్రెస్ కుదుపుకు గురి అయ్యింది, అలాంటి ప్రతి కూలత లో వేరువక కాంగ్రెస్ జెండాను మరింత బుజాల పైకి ఎత్తుకున్న నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త*
*కురవి మండలం లోని నల్లెల్ల గ్రామానికి చెందిన తొలితరం ఉస్మానియా యూనివర్సిటీ నాటి విద్యా వంతులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆదినుండి తాతల తండ్రుల నుండి ఆయన వారసత్వంగా కుటుంబాలు నేపథ్యమంతా కాంగ్రెస్ లోనే కొనసాగింది, కష్టాలు కడగండ్లు ప్రతికూల పరిస్థితులు, ఆఖరికి ప్రాణభయం ఉన్నప్పటికీ. ఆయన శ్వాస ధ్యాస అంతా కాంగ్రెస్ పార్టీలోనే కొన సాగింది.. 1982 దశకంలో తెలుగుదేశం సునామీ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ గడ్డు కాలం వచ్చిన సమయంలో వీరభద్రం కాంగ్రెస్ జెండాను మరింత బిగుతుగా బుజాల పైనే మోశాడు..రెండవ సారి మళ్ళీ తెలంగాణా ఉద్యమ తీవ్రతతో మళ్ళీ కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అయింది, అయినప్పటికీ 2014 తెలంగాణా రాష్ట్రం లో బిఆర్ ఎస్ హవాతో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ. డోర్నకల్ నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించడంలో కీలక భూమిక వహించారు. డోర్నకల్ నియోజకవర్గంలో బీసీ బిడ్డ గా కాంగ్రెస్ లో సాహసోపేత చారిత్రక ఘట్టంపై ప్రత్యేక కధనం..*
తొలి సమయం, ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ సెప్టెంబర్ 22:
వర్షంలో తడుస్తూ చలికి వణుకుతు ఎండల్లో ఎండుతూ ఆరు కాలాలు కష్టపడే రైతన్న తను పండించిన పంట చేతికొచ్చినప్పుడు ఉండే ఆనందానికి అవధులు ఉండవు.. కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్సే కావాలి అంటూ దీర్ఘకాలికంగా.. కాంగ్రెస్ రాజకీయ సేద్యంలోనే ముప్పావు జీవితం ముగిసిన అంబటి వీరభద్రం ప్రతిభకు కాంగ్రెస్ పార్టీ పట్టం కడితే.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ విభాగాలకు సేవ చేసే అదృష్టం ఆయనకు కలుగుతుందని కురవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు బలంగా కొనసాగుతున్నాయి..
*35 సంవత్సరాలుగా ఆయన కుటుంబం మొత్తంగా కాంగ్రెస్ కే అంకితం* పార్టీలో నిర్వహించిన ఆయన నిర్వహించిన పదవులు…1992-96 కురవి మండల విద్యా కమిటీ చైర్మన్ గా పని చేశారు. 2001–2006వరకు కురవి మండలం జెడ్పిటీసీ గా కొనసాగారు. 2006-12వరకు వీరభద్రం సతీమణి శకుంతల నల్లెల్ల గ్రామ ఎంపీటీసీగా కొనసాగారు.
*రాజకీయ కార్యక్రమాలు* 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహించారు, డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతి శాసనసభ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సాధించిన ప్రతి విజయంలో వీరభద్రం మార్క్ ఉంటుంది.1988,1994,1999 నాటి శాసనసభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వరుస విజయాల వెనుక వీరభద్రం కృషి అక్షర సత్యంగా నిలిచింది. 2014 లో తిరిగి రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా 24 వేల మెజారిటీతో గెలిచి రాష్ట్రంలోనే హ్యాట్రిక్ సాధించారు, ఆ విజయంలోనూ అంబటి కష్టం దాగి ఉన్నది ,2003 దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆయాం పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంను కలిగి ఉన్నారు. నిరవధికంగా కాంగ్రెస్ పార్టీలోవరుస విజయాలు సాధించిన
*మాజీ శాసనసభ్యులు రెడ్యానాయక్ 2014లో కాంగ్రెస్ నుండి గెలిచి పార్టీ ఫీరాయించి బిఆర్ఎస్ లోకి వెళ్లారు..*
ఆయన తోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య లీడర్లు కూడా గులాబీ కండువా కప్పుకున్నప్పటికీ.. స్థిరంగా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఎన్నో బెదిరింపులు కష్టాలు ఆర్థిక నష్టాలు, ప్రాణభయం ఉన్నప్పటికీ అకుంఠిత దీక్షతో కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2018లో డోర్నకల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కొనసాగుతున్నప్పటికీ.. అతనిపై ఎన్ని ఒత్తిడీలు చేసినప్పటికీ పట్టువదలని విక్రమాదిత్యుడు, స్థిరచిత్తుడు అంబటి వీరభద్రం. 2014లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ వీరభద్రం నిజాయితీ,సహనానికి. గుర్తుగా కొరివి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమించారు. పార్టీ పిసిసి లైన్ ఇచ్చినటువంటి అన్ని ట్రైనింగ్ క్లాసులకు నియమ నిబంధనలను ఫాలో అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన జనజాగరణ సభకు కురవి మండల నుండి అయిదు వేలమంది కార్యకర్తలను తరలించారు.డోర్నకల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు జాటోత్ రామచంద్రనాయక్ అఖండ విజయంలోను గణనీయమైన పాత్ర పోషించారు… నామినేటెడ్ పదవి అవకాశం కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్న అంబటి వీరభద్రం ప్రతిభకు కాంగ్రెస్ పట్టం కట్టేనా! కల సహకారం అయ్యేనా! ఆశిద్దాం…