నా భర్తతో ప్రాణహాని ఉంది.అనునిత్యం వేధింపులె,,
-ఎమ్మెల్యే కు మహిళ మొర.
-స్పందించిన ఎమ్మెల్యే.
-తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐ ఎమ్మెల్యే ఆదేశం.
బయ్యారం,తొలి సమయం,సెప్టెంబర్ 21.
ఇల్లందు కోరం కనకయ్య బయ్యారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో బాగంగా శనివారం మండల కేంద్రంలో రైతు సహకార సంఘ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశంలో మాటమంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇర్సులాపురం గ్రామానికి చెందిన బయ్య మౌనిక భర్త తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ,పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని,తన భర్త నుండి వేరుగా ఉంటూ పిల్లలను పోషించుకుంటున్నా వేధింపులు తప్పడం లేదని,నా భర్త తో నాకు ప్రాణహాని ఉందని,అతనిని చట్టపరంగా చర్య తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.దీనిపై ఎమ్మేల్యే స్పందించి మహిళ భర్త పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అదే విదంగా మండలంలో రైతుల రుణ మాఫి అయిన రైతులు గతంలో, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పహానిల పై రుణం పొంది మాఫి కానీ రైతుల విషయంలో వారి సాగు భూములకు ధరణి పట్టా,ఆర్ ఓ ఆర్ పాస్ బుక్ లు రాకపోవడంతో బ్యాంక్ లో ఉన్న రుణం మాఫీ కాక ,కొత్త రుణం అందడంలేదని కస్తూరి నగరం మహిళా రైతు ఎమ్మెల్యే ఎదుట తన గోడును వెళ్ల బోసుకుంది.ఎమ్మేల్యే దీనిపై క్యాబినెట్ లో ప్రస్థావించి బయ్యారం మండల రైతులకు న్యాయం చేస్థామని హామి ఇచ్చారు. తులారం కాలువ గండ్లు పడ్డాయాని వాటిని పునరుద్ధరణ చేసి రైతులకు సాగు నీరు అందించాలని గౌరారం,వినోభనగర్ రైతులు ఎమ్మేల్యే ను కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధూకర్ రెడ్డి,సీఐ రవి కుమార్,కంబాల ముసలయ్య, వెంకటపతి,నర్సయ్య,రాకేష్,,తొట్టి కృష్ణ,మండల పోడు రైతులు వారితో ఉన్నారు.