జయ్యారం శివారు మంగోరి గూడెం 153సర్వే నంబర్ భారీ జేసీబీ లతో బోళ్ళు ఏనెలను తోడేస్తున్నారు
భారీ గోతులు తవ్వి,తొవ్విన బండరాళ్ళతో నింపి చదునుచేస్తున్నారు
—- అక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న భూములకు ఆనుకొన్న ఏనెలు, ఫారెస్ట్ భూములు స్వాహా..
— ఇటీవల వరదలతో ఈ ప్రాంతం ఉక్కిరి బిక్కిరి..
తొలి సమయం డోర్నకల్ సెప్టెంబర్ 21:
రిజిస్ట్రేషన్ భూములకు ఆనుకొని ఉన్న వ్యవసాయానికి యోగ్యత లేని బోళ్ళు ఈనెలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు టార్గెట్ చేస్తున్నారు.. గ్రామాల్లోని రైతులను ముందు పెడుతూ వ్యవసాయ యోగ్యం గాని భూముల్లో వాగులు వంపులు. బొందలను భారీ జెసిబి లతో అత్యాధునిక సరళ యంత్రాలతో బోళ్లను ఏ నెలను తవ్విన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేస్తున్నారు.. రిజిస్ట్రేషన్ భూములంటూ.. మా భూమిని మేము చదును చేసుకుంటున్నాము. అని సమాధానాలు ఇస్తున్నారు.. ఏళ్ల తరబడి ఉన్న బోళ్ళు ఏనెలను తొవ్వేస్తున్నారు.. అధికారులు అంటే లెక్కలేని తనం కొట్టొస్తోంది.పేరుకి వ్యవసాయమా! లేక రియల్ వ్యాపారుల స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను బలి పెడుతున్నారా! అని అనుమానాలకు తావిస్తోంది.. రకరకాల జీవ వైవిధ్యంతో పశువులు గొర్రెలు మేకలు మేయడానికి అనువుగా ఉన్న కంచలు, బంజరు భూములుగా ఉండే పర్యావరణ పరిసరాలను కబలిస్తున్నారు..ఇటీవల డోర్నకల్ నియోజకవర్గంలో వరదలు తాండవం చేశాయి, ఆ విశాదం తాలూకు తడి ఆరకముందే.. మళ్లీ రియల్ వ్యాపారులు యధావిధిగా పంజా విసురుతూనే ఉన్నారు..పర్యావరణాన్ని చర పడుతూనే ఉన్నారు.వివరాల్లోకి వెళితే… 153 సర్వేనెంబర్ జయ్యారం శివారు మంగోరి గూడెం దగ్గర ఈ భారీ తవ్వకాలు జరుగుతున్నాయి.. దీంట్లో కొంత ఫారెస్ట్ భూమి కూడా ఉన్నట్టుగా అనుమానాలకు తావిస్తోంది.. వ్యవసాయ అవసరానికి రైతులు చేసుకుంటున్న చదును అయితే బాగానే ఉంటుంది.. కానీ వ్యవసాయం పేరుతో రైతుల బూములను చౌకబారుగా కొని అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ భూమికి బోళ్ళు యేనెలు మరియు ఫారెస్ట్ భూమిని కలుపు కుంటున్నారనే ప్రచారంగా బలంగా సాగుతోంది.
. కనుక వెంటనే రెవిన్యూ, ఇరిగేషన్, మైనింగ్ ఫారెస్ట్ అధికారులు స్పందించి, ప్రభత్వభూమి, ఫారెస్ట్ భూములు ఉన్నట్లు అయితే వెంటనే జేసీబీ లు భారీ సరళ యంత్రాలను అదుపులోనికి తీసుకొని..తగిన చర్యలు తీసుకోవాలి పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు