“కూలి మీడియా….
—ఎవరి ప్రయోజనం కోసం..
—అదిగో పులి వచ్చే! కధలాగా అధికారులు ఇబ్బందులు కోరి తెచ్చుకోవొద్దు
తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 18: మానుకోట జిల్లా లో ఫేక్ విలేకరుల తాకిడితో అవినీతి అధికారులు కన్ఫ్యూషన్ కు గురవుతున్నారు, విలేఖరి ఎవడో? విలేఖరి ముసుగులో దందాజేసేటోడెవడో! పెయిడ్ వార్తలు రాస్తూ పత్రికల్లో పందిని నందిని చేసే హిప్పోక్రసీ వార్తలు వండి వార్చుతూ భజన మాటలు చెబుతూ నాలుగు రాళ్లు వెనుకేసుకునే భజన విలేకర్ల తాకిడితో అధికారులు దారి తప్పుతున్నారు,మైనింగ్, రియల్, బెల్లం గుట్కా గంజా, చెరువులకబ్జా ఫైనాన్స్ మాఫియాల దగ్గర సాగిల పడి హుజూర్ అంటూ.. 4ప్లాట్స్ 4కోట్లు వెనుకేసుకున్న అవినీతి పచ్చ కామెర్లు సోకిన కూలి సోకాల్డ్ విలేకర్ లే మావాళ్ళు అనుకొంటున్నారు, అందుకే అధికారుల్లో అవినీతి జాడ్యం ఆవరిస్తోంది. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 3వందల మంది విలేకరులు వస్తున్నారు,సమాదానం ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి ,రాసుకో అంటూ వెకిలి నవ్వులతో సరి పెట్టుకుంటున్నారు..
ఈవార్తలు ఎవరు ఎవరు రాయాలి
నాలుగు మండలాల్లో మరిపెడ కురవి చిన్న గూడూరు నరసింహుల పేట నెల్లికుదురు మండలాల్లో మైనింగ్ ఇసుక మాఫియా
కొత్త ప్రభుత్వంలో కూడా… కొత్త పుంతలు తొక్కుతోంది.
మార్పుకోరిన ప్రజల ఆశల్లో కొత్త ప్రభత్వం కూడా నీళ్ళొదులుతోంది
వర్షం ఒరుపు ఇవ్వగానే.. జరిగిన వరద నష్టం జ్ఞాపకాల తడి ఆరక ముందే వేలాది ట్రాక్టర్లు. టిప్పర్లు బండరాళ్లతో కంకరతో ఇసుక మట్టితో రోడ్లెక్కుతున్నాయి.. అతివేగంతో జిల్లా కేంద్రం మండల కేంద్రాల్లో భారీ శబ్దాలతో రోడ్లపై హారన్ కొడుతూ పరుగులు పెడుతున్నాయి…మొత్తం చెరువులు కుంటలు శికాలు కబ్జాలు అయిపోయాయి..పర్యావరణం ప్రకృతి విధ్వంసమై పోయింది, మొత్తం ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఆస్తులుగా ఫేక్ రిజిస్ట్రేషన్ లతో పేపర్ ల పై నమోదు అయ్యాయి. అవినీతి కంపుతో స్వీప్ అవుట్ చేశారు..ఎప్పుడు అతివృష్టి అనావృష్టి, రోగాలు, విపత్తులు సంభవిస్తాయో! తెలువని పరిస్థితి జిల్లాను ఆవరించింది…ముఖ్యంగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్. ఎలక్ట్రిసిటీ పొల్యూషన్,అధికారులు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు.. జవాబు ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది… కానీ నిజమైన జర్నలిస్టులు అంటేనే.. వీళ్లకు ఎలర్జీ వస్తోంది.. సంబంధిత క్యారీడర్ను అప్రమత్తం చేసి వాస్తవాలు రాసే జర్నలిస్టులపై గోబెల్ ప్రచారానికి తెరతీస్తున్నారు…కనుక జిల్లాల ఇబ్బడి ముబ్బడిగా, దండుపాళ్యం ల ఏర్పడ్డ కూలి మీడియా లో ఎవరి ప్రొయోజనం దాగి ఉంటే… భూములు చెరువులు కొండలు, గుట్టలు ప్రకృతి సంపద కొల్లగట్టబడింది అనేది తెలిసిన జర్నలిస్ట్ లు అడిగిన వివరణకు సమాధానం ఇవ్వకుండా… దాటివేత కు గురిచేస్తున్నారు.. అదిగో పులి వొచ్చే! అనే కధ లాగా…. నిజంగానే ప్రమాదం లో పడే పరిస్థితిని అధికారులు కోరి కొని తెచ్చుకుండా… అడిగిన వివరణకు పారదర్శకతతో సమాధానాలు ఇస్తే బాగుంటుందని జర్నలిస్టులు కోరుకుంటున్నారు,