కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడిలో దొరికిపోయిన హార్టీ కల్చర్ అధికారి సూర్య నారాయణ..
*—-రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ అధికారి*
సూర్య నారాయణ గతం లో మానుకోట జిల్లాలో పనిచేయడం గమనార్హం
తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్18:
కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ మెరుపు దాడిలో రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ.దొరికి పోయారు
డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు
ఏసీబీ దాడి జరిగింది.
అదుపులోకి తీసుకున్న అధికారి సూర్యనారాయణను
ఏసిబి డిఎస్పి వై రమేష్ దర్యాప్తు చేస్తున్నారు
సూర్యనారాయణ చాలా సంవత్సరాలు మహబూబాబాద్ జిల్లాలో పనిచేసి ఇటీవలే బదిలీపై భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు బదిలీపై వెళ్లడం గమనార్హం