అంబులెన్సు లో గంజాయి రవాణా కలకలం

అంబులెన్సు లో గంజాయి రవాణా కలకలం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

—-2నుండి 3క్వింటాల గంజాయి స్వాధీనం

— విలువ సుమారు 2కోట్లు గా అంచనా

తొలి సమయం మహబూబాబాద్ సెప్టెంబర్ 15: అర్థరాత్రి అంబులెన్సు లో గంజాయి రవాణా కలకలం రేపుతోంది. సుమారు రెండు నుండి 3క్వింటాల గంజాయి ఉన్నట్లు గా తెలుస్తోంది, దీని విలువ సుమారు రెండు కోట్లు అంచనా ఉండవచ్చును అనేది తెలుస్తోంది, వివరాల్లోకి వెళితే కొత్త గూడెం లోని రామవరం సింగరేణి సివిల్ విభాగం ఆఫీస్ వద్ద అంబులెన్స్ కు పంచర్ అయింది,అంబులెన్స్ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తో నమోదు అయ్యిందనేది సమాచారం . పంచర్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు సహకరించారు. అనుమానం వచ్చి లోపట ఏముండదని ఆ ముగ్గురు ప్రశ్నించగా, స్పష్టత లేని సమాధానం రావడంతో పోలీస్ లకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు అప్రమత్తమై అంబులెన్స్ ను మరియు రావణాకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుండి ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *